ఉక్రెయిన్‌పై ‘ఒరెష్నిక్’ క్షిపణితో రష్యా దాడి
ABN , Publish Date - May 25 , 2026 | 03:56 AM
ఉక్రెయిన్ రాజధాని కీవ్ రీజియన్‌పై డ్రోన్లు, క్షిపణులతో రష్యా మరోసారి విరుచుకుపడింది. శనివారం అర్ధరాత్రి కీవ్ పరిధిలోని ‘బిలా త్సెర్క్వా’ నగరాన్ని...
నలుగురి మృతి.. 100 మందికి గాయాలు
కీవ్/మాస్కో, మే 24: ఉక్రెయిన్ రాజధాని కీవ్ రీజియన్‌పై డ్రోన్లు, క్షిపణులతో రష్యా మరోసారి విరుచుకుపడింది. శనివారం అర్ధరాత్రి కీవ్ పరిధిలోని ‘బిలా త్సెర్క్వా’ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని తన అత్యంత శక్తిమంతమైన, అణు సామర్థ్యం గల ‘ఒరెష్నిక్’ హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఈ దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, సుమారు 100 మంది వరకు గాయపడ్డారని ఉక్రెయిన్ వెల్లడించింది. దాడి కారణంగా నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాలు, పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించింది. నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో రష్యా ఈ క్షిపణిని ప్రయోగించడం ఇది మూడోసారి. ఈ ఆపరేషన్‌లో కేవలం ఒరెష్నిక్ క్షిపణి మాత్రమే కాకుండా, ఇస్కందర్, కింజాల్, సిర్కాన్ వంటి 90 క్షిపణులతో పాటు సుమారు 600 డ్రోన్‌లను కూడా ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది.