ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. 20 మంది మృతి
ABN , Publish Date - Oct 11 , 2026 | 03:41 AM
రష్యా జరిపిన వైమానిక దాడుల్లో ఉక్రెయిన్‌లోని జపోరిజిజియా ప్రాంతంలో ముగ్గురు చిన్నారులు సహా 20 మంది మృతి చెందగా, డజన్ల కొద్దీ గాయపడ్డారు.
కీవ్, అక్టోబరు 10: రష్యా జరిపిన వైమానిక దాడుల్లో ఉక్రెయిన్‌లోని జపోరిజిజియా ప్రాంతంలో ముగ్గురు చిన్నారులు సహా 20 మంది మృతి చెందగా, డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఉక్రెయిన్ అత్యవసర సర్వీసుల విభాగం శనివారం ఓ ప్రకటనలో ఈ విషయం తెలిపింది. రష్యా నుంచి డీజిల్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకొంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన మరునాడే ఉక్రెయిన్‌పై ఈ వైమానిక దాడి జరిగింది. ట్రంప్ డీజిల్ కొనుగోలు చేయడం తమపై యుద్ధం చేయడానికి రష్యాకు నిధులు సమకూర్చినట్లేనని ఉక్రెయిన్ వాదిస్తోంది.