Share News

రియాద్‌ ఎయిర్‌పోర్టుపై మళ్లీ దాడి

ABN , Publish Date - Oct 11 , 2026 | 03:49 AM

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్‌ ఖలీద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌పై శనివారం మరోసారి దాడి జరిగింది.

రియాద్‌ ఎయిర్‌పోర్టుపై మళ్లీ దాడి
riyadairport

రియాద్‌, అక్టోబరు 10: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్‌ ఖలీద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌పై శనివారం మరోసారి దాడి జరిగింది. రెండు శక్తిమంతమైన పేలుళ్లు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయాన్ని ఖాళీ చేశారు. విమానాల రాకపోకలు నిలిపివేశారు. పలు అంబులెన్సులు ఎయిర్‌పోర్టులోకి వెళ్లాయి. ఈ నెలలో ఈ ఎయిర్‌పోర్టుపై యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు పలుమార్లు దాడి చేశారు. ఈ దాడుల్లో ఓ విమాన పైలట్‌, ముగ్గురు సౌదీ పౌరులు మృతిచెందారు. వివిధ దేశాలకు చెందిన పలువురు గాయపడ్డారు. కింగ్‌ ఖలీద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌పై వరుస దాడుల నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలు ఈ నెల 15వరకు తమ సర్వీసులను రద్దు చేశాయి. వాస్తవానికి ఈ నెల 10వరకు రెండు విమానయాన సంస్థలు రియాద్‌కు తమ సర్వీసులను రద్దు చేయగా శనివారం నాటి దాడి నేపథ్యంలో ఈ నెల 15 వరకు విమాన సేవలను నిలిపివేశాయి.

Updated Date - Oct 11 , 2026 | 03:49 AM