Share News

రియాద్‌ ఎయిర్‌పోర్టుపై హూతీల దాడి.. హైదరాబాద్‌కు చెందిన యూసుఫ్‌ అలీ మృతి

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:48 AM

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్‌ ఖలీద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌పై శనివారం హూతీలు జరిపిన క్షిపణి దాడిలో భారతీయుడు సహా 13మంది మృతిచెందారు.

రియాద్‌ ఎయిర్‌పోర్టుపై హూతీల దాడి.. హైదరాబాద్‌కు చెందిన యూసుఫ్‌ అలీ మృతి

  • అలీ కుటుంబంలోని మరో ముగ్గురు సహా 11 మంది భారతీయులకు గాయాలు

రియాద్‌, అక్టోబరు 11: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్‌ ఖలీద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌పై శనివారం హూతీలు జరిపిన క్షిపణి దాడిలో భారతీయుడు సహా 13మంది మృతిచెందారు. మృతుడిని హైదరాబాద్‌ మెహిదీపట్నానికి చెందిన మహ్మద్‌ యూసుఫ్‌ అలీగా గుర్తించారు. ఆయన కుటుంబంలో మరో ముగ్గురు గాయపడ్డారు. యూసుఫ్‌ అలీ కుమారులు, ఆయన బంధువు ప్రస్తుతం రియాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన భార్య, కుమార్తె క్షేమంగా ఉన్నారని హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఎక్స్‌ద్వారా వెల్లడించారు. దాడిలో మొత్తం 309 మంది గాయపడగా వీరిలో 11 మంది భారతీయులున్నారు. మృతుల్లో మొత్తం 9 దేశాలకు చెందిన పౌరులున్నారు. దాడి నేపథ్యంలో విమానాశ్రయాన్ని ఖాళీ చేయడంతో పాటు విమానాల రాకపోకలు నిలిపివేశారు. హూతీల క్షిపణి దాడిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. అలీ కుటుంబాన్ని తాము సంప్రదించామని, భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు భారత దౌత్య కార్యాలయం తెలిపింది.

Updated Date - Oct 12 , 2026 | 04:50 AM