మిన్నియాపొలిస్‌లో మరో పౌరుడి కాల్చివేత
ABN , Publish Date - Jan 25 , 2026 | 02:51 AM
ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలోని మిన్నియాపొలి్‌సలో కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న ప్రజలపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ ...
మైనస్ 30 డిగ్రీల చలిలో ప్రజల నిరసన
మిన్నెసోటా, జనవరి 24: ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలోని మిన్నియాపొలి్‌సలో కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న ప్రజలపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ(డీహెచ్‌ఎ్‌స) ఏజెంట్లు మళ్లీ కాల్పులు జరిపారు. శనివారం జరిపిన ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు. ఈ నెల 7న ఇక్కడే డీహెచ్‌ఎ్‌స ఏజెంట్లు జరిపిన కాల్పుల్లో రెనీ గుడ్ అనే 37 ఏళ్ల మహిళ మరణించారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు వేలాదిమంది మైనస్ 30 డిగ్రీల కఠిన వాతావరణంలో కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. కాల్పుల ఘటనపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.