మంచి నేతను కోల్పోయాం
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:20 AM
అజిత్‌పవార్ మృతిపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు అజిత్ పవార్ ఎంతో కృషి చేశారని కొనియాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ, జనవరి 28: అజిత్‌పవార్ మృతిపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు అజిత్ పవార్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. గత మూడున్నర దశాబ్దాల్లో మహారాష్ట్రలోని అన్ని వర్గాల ప్రజలకు అజిత్ పవార్ ఎనలేని సేవ చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇక కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తదితరులు సంతాపం తెలిపారు. అజిత్‌పవార్ అకాల మరణం తనకు ఆవేదన కలిగించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎక్స్‌లో పేర్కొన్నారు.