Share News

Dhaka: బంగ్లాదేశ్‌లో సంక్రాంతి వేడుకలపై ఉక్కుపాదం

ABN , Publish Date - Jan 15 , 2026 | 05:04 AM

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో సంక్రాంతి వేడుకలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వేడుకలు నిర్వహించుకుంటున్న ఇళ్లకు వెళ్లి సౌండ్‌ బాక్సులను...

Dhaka: బంగ్లాదేశ్‌లో సంక్రాంతి వేడుకలపై ఉక్కుపాదం

ఢాకా, జవనరి 14: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో సంక్రాంతి వేడుకలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వేడుకలు నిర్వహించుకుంటున్న ఇళ్లకు వెళ్లి సౌండ్‌ బాక్సులను, టపాసులను స్వాధీనం చేసుకుంటున్నారు. టపాసులతో అగ్నిప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని, సౌండ్‌ బాక్సులతో శబ్దకాలుష్యం జరుగుతోందని సాకులు చెప్తున్నారు. వాస్తవానికి బంగ్లాదేశ్‌లో సంక్రాంతి(సంక్రేన్‌ అని పిలుస్తారు) పండుగకు మతభేదం లేదు. అందరూ పతంగులు ఎగురవేస్తారు. ఇది బెంగాలీ సంప్రదాయమని, మొగలుల కాలం నుంచి కొనసాగుతోందని స్థానికులు చెప్తున్నారు. అయితే, ఏడాదికాలంగా బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అస్థిరమైన పరిణామాలు, హిందువులపై పెరుగుతున్న ద్వేషం నేపథ్యంలో ముస్లింవాదులు ఈ పండుగను తప్పుపడుతున్నారు. తమకు ఇబ్బందిగా ఉందని పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.

Updated Date - Jan 15 , 2026 | 05:04 AM