Share News

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మోదీ టెలిఫోన్‌ సంభాషణ

ABN , Publish Date - Nov 10 , 2026 | 03:06 AM

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు భారత్‌ సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. సోమవారం ఆయన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు..

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మోదీ టెలిఫోన్‌ సంభాషణ

  • యుద్ధం విరమణకు భారత్‌ సహకరిస్తుందని హామీ

న్యూఢిల్లీ, నవంబరు 9: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు భారత్‌ సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. సోమవారం ఆయన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీతో జరిపిన టెలిఫోన్‌ సంభాషణలో ఈ మేరకు ఆయనకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఆహార భద్రత కల్పించే విషయమై కృషి చేయనున్నట్టు తెలిపారు. సంప్రదింపులు, దౌత్యమార్గాల ద్వారా శాంతియుత పద్ధతుల్లో సమస్యకు పరిష్కారం కనుగొనాలన్నదే భారత్‌ అభిప్రాయమని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మానవీయ కోణంలో సమస్యను పరిష్కరించాల్సి ఉంటుందని పేర్కొంది. చర్చలపై జెలెన్‌స్కీ ఎక్స్‌లో పోస్టు పెడుతూ యుద్ధ విరమణకు భారత్‌ ఎలాంటి చర్యలు చేపడుతుంది, ఏ దేశం నాయకులతో చర్చలు జరుపుతుందన్నది ముఖ్యమని తెలిపారు. త్వరలో అబుదాబీలో భేటీ కానున్నామని, ఇందుకోసం ప్రతి ఒక్క అంశంతో అజెండాను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. యుద్ధం విరమణకు సుముఖంగా ఉన్నామని, రష్యా కూడా అదే వైఖరిని చూపించాల్సి ఉందని తెలిపారు. నల్ల సముద్రం మీదుగా ఆహార ధాన్యాల ఎగుమతులను రష్యా అడ్డగిస్తుండండంపై మోదీతో చర్చించినట్టు వివరించారు.

Updated Date - Nov 10 , 2026 | 03:08 AM