Share News

ఇరాన్‌పై యుద్ధంతో లాభార్జన కోసం అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్‌ పెట్టుబడులు!

ABN , Publish Date - Apr 01 , 2026 | 03:41 AM

యుద్ధం విషయం ముందే తెలిసి అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ భారీగా డబ్బు సంపాదించాలని అనుకున్నారా? అంటే అవునని అంటున్నాయి వార్తా కథనాలు.

ఇరాన్‌పై యుద్ధంతో లాభార్జన కోసం అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్‌ పెట్టుబడులు!

  • ఆ ఆరోపణలు అవాస్తవాలు: పెంటగాన్‌

న్యూఢిల్లీ, మార్చి 31: యుద్ధం విషయం ముందే తెలిసి అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ భారీగా డబ్బు సంపాదించాలని అనుకున్నారా? అంటే అవునని అంటున్నాయి వార్తా కథనాలు. ఇరాన్‌తో యుద్ధానికి కొద్ది వారాల ముందు ఓ రక్షణ సంబంధిత ఆస్తుల్లో భారీగా పెట్టుబడుల కోసం హెగ్సెత్‌కు సంబంధించిన బ్రోకర్‌ ప్రయత్నించినట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. మోర్గాన్‌ స్టాన్లీకి చెందిన ఆ బ్రోకర్‌ బ్లాక్‌రాక్‌కు చెందిన డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ యాక్టివ్‌ ఈటీఎఫ్‌ (ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌)లో లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ఫిబ్రవరిలో ఆ సంస్థను సంప్రదించినట్లు కథనం వెల్లడించింది. కాగా, ఆ బ్రోకర్‌ స్వతంత్రంగా వ్యవహరించాడా? లేక హెగ్సెత్‌ సూచనలు మేరకు ఆ పెట్టుబడుల కోసం ప్రయత్నించాడా? అన్న వివరాలు ఆ కథనం వెల్లడించలేదు. ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనంపై పెంటగాన్‌ ప్రతినిధి సీన్‌ పార్నెల్‌ తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం ఆయన ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ, ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు.

Updated Date - Apr 01 , 2026 | 03:41 AM