Carry Medicines to Saudi Arabia: అనుమతి ఉంటేనే సౌదీకి మందులు తీసుకెళ్లొచ్చు
ABN , Publish Date - Jan 03 , 2026 | 02:47 AM
సౌదీ అరేబియా వెళ్లే భారతీయులు తమ వెంట కొన్ని రకాల మందులు తీసుకొని వెళ్లాలంటే ముందుగా ఆ దేశం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని మాదక ...
న్యూఢిల్లీ, జనవరి 2: సౌదీ అరేబియా వెళ్లే భారతీయులు తమ వెంట కొన్ని రకాల మందులు తీసుకొని వెళ్లాలంటే ముందుగా ఆ దేశం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో (ఎన్‌సీబీ) శుక్రవారం తెలిపింది. భారత దేశంలో కొన్ని రకాల మందులు కొనుగోలు చేయడం చట్టబద్ధమే అయినప్పటికీ ఆ దేశంలో మాత్రం వాటిపై ఆంక్షలు ఉంటాయని పేర్కొంది. అందువల్ల ఆ వివరాలను తెలుసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది. మందులను కూడా నిర్ణీత మొత్తంలోనే తీసుకెళ్లాల్సి ఉంటుందని, అంతకుమించితే చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. మందులకు అనుమతి ఇచ్చే విషయమై ప్రత్యేకంగా పోర్టల్‌ను ఏర్పాటు చేసిందని, దాంట్లో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపింది.