Share News

పెళ్లికి తొలగిన అడ్డంకులు! భారత్‌కు 150 మంది పాకిస్థానీ సింధీ యువతులు

ABN , Publish Date - Aug 23 , 2026 | 10:22 PM

భారతీయ యువకులతో నిశ్చితార్థం జరుపుకున్న దాదాపు 150 మంది పాకిస్థానీ సింధీ యువతులు భారత్‌కు చేరుకున్నారు.

పెళ్లికి తొలగిన అడ్డంకులు! భారత్‌కు 150 మంది పాకిస్థానీ సింధీ యువతులు
Pakistani Sindhi women Marriages in India

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ యువకులతో నిశ్చితార్థం జరుపుకున్న దాదాపు 150 మంది పాకిస్థానీ సింధీ యువతులు భారత్‌కు చేరుకున్నారు. ఆపరేషన్ సిందూర్ తరువాత ఇప్పటివరకూ వారికి వీసాల జారీ నిలిచిపోవడంతో వివాహాలకు బ్రేక్ పడ్డాయి. మళ్లీ ఇన్నాళ్లకు కేంద్రం అక్కడి సింధీ యువతులు, వారి బంధువులకు వీసాలు మంజూరు చేసింది. దీంతో, ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ 150 మంది సింధీ యువతులు భారత్‌కు చేరుకున్నారు. ఆపరేషన్ సిందూర్ తరువాత వీసాలు నిలిపివేయడంతో పాటు అట్టారీ-వాఘా బార్డర్‌ను భారత్ మూసివేసిన విషయం తెలిసిందే.


ఇన్నాళ్లుగా వేచి చూస్తున్న వారికి ఎట్టకేలకు శుభం కార్డు పడిందని ఈ వ్యవహారాలను పర్యవేక్షించే రాజేశ్ జాంబియా తెలిపారు. ఇలాంటి వివాహాల కోసం ఏటా సింధ్ ప్రాంతంలోని వారు భారత్‌కు అట్టారీ-వాఘా బార్డర్ మీదుగా వస్తుంటారని చెప్పారు. ప్రస్తుత ఆంక్షల నేపథ్యంలో వారు మస్కట్, దుబాయ్, శ్రీలంక తదితర దేశాల మీదుగా ట్రాన్సిట్ మార్గాల్లో భారత్‌కు చేరుకున్నారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తరువాత అట్టారీ-వాఘా బార్డర్ మీదుగా వచ్చే పాక్ వ్యక్తుల వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని చెప్పారు.

ఈ నేపథ్యంలో పాక్ యువతుల కుటుంబాలు భారత్‌లోని హిందూ మతసంస్థలను సంప్రదించాయని చెప్పారు. వారి సాయంతో హోం శాఖను ఆశ్రయించాయని వివరించారు. ఈ క్రమంలో వారు విమాన మార్గంలో వస్తేనే దేశంలోకి అనుమతిస్తామని కేంద్రం చెప్పడంతో ఆ మేరకు వారు వచ్చారని తెలిపారు. మరో 300 మంది పాక్ సింధీ యువతులు అనుమతుల కోసం నిరీక్షిస్తున్నారని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

ఇరాన్ ముందున్న మంచి మార్గం అదొక్కటే: అధ్యక్షుడు పెజెష్కియాన్

తుర్కియే మిలిటరీ విమానాల్లో డ్రోన్స్ తరలింపు?

Updated Date - Aug 23 , 2026 | 10:27 PM