Share News

331 మంది తాలిబాన్లను చంపేశాం

ABN , Publish Date - Mar 01 , 2026 | 03:42 AM

భూతల, వైమానిక దాడుల ద్వారా 331 మంది అఫ్గానిస్థాన్‌ తాలిబాన్‌ ఫైటర్లను చంపేశామని పాకిస్థాన్‌ శనివారం ప్రకటించింది.

331 మంది తాలిబాన్లను చంపేశాం

  • పాకిస్థాన్‌ ప్రకటన.. చర్చలకు సిద్ధమన్న తాలిబాన్లు

  • పాక్‌ మంచిపని చేస్తోంది: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

ఇస్లామాబాద్‌, ఫిబ్రవరి 28: భూతల, వైమానిక దాడుల ద్వారా 331 మంది అఫ్గానిస్థాన్‌ తాలిబాన్‌ ఫైటర్లను చంపేశామని పాకిస్థాన్‌ శనివారం ప్రకటించింది. వీరిలో తెహ్రీక్‌ ఏ తాలిబాన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ), అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ తదితర సంస్థల ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు పాకిస్థాన్‌ సమాచార శాఖ మంత్రి అతొల్లా తరార్‌ వెల్లడించారు. అఫ్గానిస్థాన్‌పై ఘజబ్‌ లిల్‌ హక్‌ పేరుతో పాకిస్థాన్‌ సైనిక చర్య చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సరిహద్దుల్లోని 104 అఫ్గాన్‌ మిలిటరీ పోస్టులను పూర్తిగా ధ్వంసం చేసి, 22 పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు తరార్‌ చెప్పారు. పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ ఘర్షణపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శనివారం స్పందించారు. ఆయన పాకిస్థాన్‌ చర్యకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పాకిస్థాన్‌ మంచిపనే చేస్తోందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌తో విబేధాలను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని అఫ్గానిస్థాన్‌ విదేశాంగ మంత్రి ఆమిర్‌ ఖాన్‌ ముత్తాఖీ శనివారం తెలిపారు.

Updated Date - Mar 01 , 2026 | 03:44 AM