Share News

సౌదీకి పాక్‌ సైన్యం, ఫైటర్‌ జెట్లు

ABN , Publish Date - May 19 , 2026 | 04:20 AM

పాకిస్థాన్‌-సౌదీ అరేబియాల మధ్య కుదిరిన పరస్పర రక్షణ ఒప్పందం తొలిసారిగా అమల్లోకి వచ్చింది. అమెరికా-ఇరాన్‌ల మధ్య మళ్లీ యుద్ధం జరిగే సూచనలు కనిపిస్తుండడంతో ...

సౌదీకి పాక్‌ సైన్యం, ఫైటర్‌ జెట్లు

  • అమల్లోకి వచ్చినరక్షణ ఒప్పందం

ఇస్లామాబాద్‌, మే 18: పాకిస్థాన్‌-సౌదీ అరేబియాల మధ్య కుదిరిన పరస్పర రక్షణ ఒప్పందం తొలిసారిగా అమల్లోకి వచ్చింది. అమెరికా-ఇరాన్‌ల మధ్య మళ్లీ యుద్ధం జరిగే సూచనలు కనిపిస్తుండడంతో సౌదీ రక్షణ కోసం పాక్‌ తన సైన్యాన్ని పంపించింది. 8,000 మంది సైనికులు, ఒక స్క్వాడ్రన్‌ అంటే సుమారు 16యుద్ధ విమానాలను తరలించింది. పాకిస్థాన్‌, చైనాలు కలిసి రూపొందించిన జెఎఫ్‌-17 యుద్ధ విమానాలను పంపించింది. ఇవి కాకుండా రెండు స్క్వాడ్రన్ల డ్రోన్లు, హెచ్‌క్యూ-9 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టంలను కూడా పంపించింది. వీటి నిర్వహణకు సౌదీ నిధులు సమకూర్చనుండగా, పాక్‌ సిబ్బంది సేవలు అందించనున్నారు. యుద్ధానికి సంసిద్ధంగా ఉండే సైనికులను పంపించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. సౌదీ ఇంధన వనరులపై ఇరాన్‌ గురిపెట్టినప్పుడు ఇంతకుముందు కూడా పాక్‌ తన యుద్ధ విమానాలను పంపించింది. ఒప్పందం ప్రకారం అవసరమయితే 80వేల మంది సైనికులను, యుద్ధ నౌకలను తరలించే అవకాశం ఉందని పాక్‌ అధికారి ఒకరు చెప్పారు.

Updated Date - May 19 , 2026 | 04:20 AM