Share News

మళ్లీ యుద్ధం వస్తే ఆరెస్సెస్‌ క్యాంపులపై దాడి

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:27 AM

భారత్‌పై పాకిస్థాన్‌ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ మరోసారి నోరు పారేసుకున్నారు. మరోసారి యుద్ధమంటూ వస్తే.. భారత్‌లో సుదూర ప్రాంతాల్లోకి చొరబడి మరీ దాడులు చేస్తామని అన్నారు.

మళ్లీ యుద్ధం వస్తే ఆరెస్సెస్‌ క్యాంపులపై దాడి

  • పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ప్రగల్భాలు

ఇస్లామాబాద్‌, ఏప్రిల్‌ 3: భారత్‌పై పాకిస్థాన్‌ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ మరోసారి నోరు పారేసుకున్నారు. మరోసారి యుద్ధమంటూ వస్తే.. భారత్‌లో సుదూర ప్రాంతాల్లోకి చొరబడి మరీ దాడులు చేస్తామని అన్నారు. ఆరెస్సెస్‌ క్యాంపులపైనా దాడులు చేస్తామని హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడులు జరిగి ఏడాది అవుతున్న నేపథ్యంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం కేరళంలో మాట్లాడుతూ.. సరిహద్దుల్లో పాకిస్థాన్‌ మరోసారి దుస్సాహసానికి పాల్పడితే మన ప్రతిస్పందన కఠినంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. రాజ్‌నాథ్‌ వ్యాఖ్యలపై ఆసిఫ్‌ శుక్రవారం ఎక్స్‌లో స్పందించారు. ‘మేము దేనికైనా సిద్ధంగానే ఉన్నాం. ఈసారి వేగవంతమైన, నిర్ణయాత్మక ప్రతిస్పందనకు పాక్‌ సిద్ధంగా ఉంది. ఈసారి ఘర్షణ 200-250 కిలోమీటర్ల పరిధికి మాత్రమే పరిమితం కాదు. మేము వారి (భారత్‌) భూభాగంలోకి, వారి ఇళ్లలోకి చొరబడి దాడులు చేస్తాం. ఆరెస్సెస్‌ సభ్యుల క్యాంపులపైనా దాడి చేస్తాం’ అని అన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 04:27 AM