Share News

పాక్‌ ఉద్యోగుల జీతాల్లో 30శాతం వరకు కోతలు

ABN , Publish Date - Mar 16 , 2026 | 03:31 AM

ఇరాన్‌ యుద్ధ ప్రభావంతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాక్‌ పొదుపు చర్యలపై దృష్టి సారిస్తోంది. దీనిలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థల ఉద్యోగుల వేతనాల్లో 5 శాతం....

పాక్‌ ఉద్యోగుల జీతాల్లో 30శాతం వరకు కోతలు

ఇస్లామాబాద్‌, మార్చి 15: ఇరాన్‌ యుద్ధ ప్రభావంతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాక్‌ పొదుపు చర్యలపై దృష్టి సారిస్తోంది. దీనిలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థల ఉద్యోగుల వేతనాల్లో 5 శాతం నుంచి 30 శాతం వరకూ కోత విధించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలకు పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ ఆమోదం తెలిపారు. అలాగే ప్రభుత్వ వాహనాలకు కేటాయించే ఇంధనంలో 50 శాతం కోత విధించడంతో పాటు వచ్చే రెండు నెలల్లో వీటిలో 60 శాతం వాహనాలు రోడ్లపైకి రాకుండా నిలిపివేయనున్నారు. వచ్చే 2నెలల పాటు క్యాబినెట్‌ సభ్యులు, మంత్రులు, సలహాదారులు, ప్రత్యేక సహాయకుల వేతనాలు నిలిపివేస్తారు. ప్రభుత్వ అధికారులు, మంత్రులు, సహాయ మంత్రుల విదేశీ పర్యటనలపై నిషేధం అమలు చేస్తారు.

Updated Date - Mar 16 , 2026 | 03:31 AM