తుర్కియే, ఖతార్, ఇండోనేసియాలతో పాక్ ‘బదర్’ ఒప్పందం
ABN , Publish Date - Oct 23 , 2026 | 04:00 AM
రక్షణ రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు సాంకేతికతను బలోపేతం చేసుకునేందుకు తుర్కియే, ఖతార్, ఇండోనేసియా దేశాలతో..
రక్షణ రంగంలో పరస్పర సహకారం కోసమే
దోహా, అక్టోబరు 22: రక్షణ రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు సాంకేతికతను బలోపేతం చేసుకునేందుకు తుర్కియే, ఖతార్, ఇండోనేసియా దేశాలతో పాకిస్థాన్ ఓ బహుపాక్షిక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీన్ని ‘బదర్’ ఒప్పందంగా పేర్కొంటున్నారు. ఖతార్ రాజధాని దోహాలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, తుర్కియే రక్షణ మంత్రి యాసర్ గులర్, ఇండోనేసియా ఉప రక్షణ మంత్రి యూసుఫ్ జౌహరి, ఖతార్ ఉప ప్రధాని, రక్షణ శాఖ సహాయ మంత్రి షేక్ సౌద్ బిన్ అబ్దుల్ రహ్మాన్‌లు సమావేశమై.. ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ ఈ రక్షణ ఒప్పందం కుదరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆగస్టులో పాక్, సౌదీ అరేబియా, తుర్కియే దేశాల మధ్య మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం కుదిరిన రెండు నెలల్లోనే బదర్ ఒప్పందం తెరపైకి రావడం గమనార్హం.