Share News

పీవోకేలో కూలిన పాక్‌ ఆర్మీ హెలికాప్టర్‌

ABN , Publish Date - Jun 11 , 2026 | 04:07 AM

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో బుధవారం ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం సంభవించింది. పాకిస్థాన్‌ ఆర్మీకి చెందిన ఎమ్‌ఐ-17 హెలికాప్టర్‌ ముజఫరాబాద్‌ ...

పీవోకేలో కూలిన పాక్‌ ఆర్మీ హెలికాప్టర్‌

  • 21 మంది భద్రతా సిబ్బంది దుర్మరణం

ఇస్లామాబాద్‌/ ముజఫరాబాద్‌, జూన్‌ 10: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో బుధవారం ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం సంభవించింది. పాకిస్థాన్‌ ఆర్మీకి చెందిన ఎమ్‌ఐ-17 హెలికాప్టర్‌ ముజఫరాబాద్‌ సమీపంలో కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న 21 మంది భద్రతా సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని పాక్‌ మిలిటరీ మీడియా విభాగం ‘ఐఎ్‌సపీఆర్‌ తెలిపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నీలం వ్యాలీ సెక్టార్‌లోని సరిహద్దు ప్రాంతాలకు అదనపు బలగాలను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముజఫరాబాద్‌ బేస్‌ నుంచి టేకాప్‌ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లు అత్యవసర ల్యాండింగ్‌ కోసం ప్రయత్నించారు. అయితే, హెలికాప్టర్‌ సురక్షితంగా కిందకు దిగడానికి ముందే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.

Updated Date - Jun 11 , 2026 | 04:07 AM