Share News

పాకిస్థాన్‌లో అస్థిరతకు భారతే కారణం!

ABN , Publish Date - Oct 22 , 2026 | 04:43 AM

భారత్‌పై పాకిస్థాన్‌ మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. పాకిస్థాన్‌లో అస్థిరతలు సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థలకు భారత్‌ మద్దతునిస్తోందని పాకిస్థాన్‌ నేషనల్‌ కమాండ్‌ అథారిటీ(ఎన్‌సీఏ) సలహాదారు..

పాకిస్థాన్‌లో అస్థిరతకు భారతే కారణం!

  • పాక్‌ ఎన్‌సీఏ సలహాదారు జమీల్‌ ఆరోపణలు

న్యూఢిల్లీ, అక్టోబరు 21: భారత్‌పై పాకిస్థాన్‌ మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. పాకిస్థాన్‌లో అస్థిరతలు సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థలకు భారత్‌ మద్దతునిస్తోందని పాకిస్థాన్‌ నేషనల్‌ కమాండ్‌ అథారిటీ(ఎన్‌సీఏ) సలహాదారు, రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మజార్‌ జమీల్‌ అన్నారు. భారత్‌ వ్యూహాత్మకంగా ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తోందని, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోబాల్‌ సిద్ధాంతాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. లండన్‌లో ఓ వర్క్‌షా్‌పలో జమీల్‌ మాట్లాడారు. భారత్‌ 1971లో ముక్తి బాహిని, 1980లో ఎల్‌టీటీఈ ఉద్యమాలకు మద్దతునిచ్చిందన్నారు. అప్ఘానిస్థాన్‌లో అంతర్జాతీయ భద్రతా బలగాలు కార్యకలాపాలు నిర్వహించిన సమయంలో (2002-14)నూ అప్ఘాన్‌-పాక్‌ సరిహద్దుల్లో ఆరు కాన్సులేట్లను నిర్వహించిందని చెప్పారు. భారత్‌ ఉగ్రవాదానికి మద్దతునిస్తుందనడానికి సాక్ష్యాలుగా వీటిని ప్రస్తావించారు. ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌ పాలనలో ఆర్మీ చీఫ్‌ మునీర్‌ జోక్యం పెరుగుతుందన్న ఆరోపణల నేపథ్యంలో.. ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో దేశం విడిచి విదేశాల్లో స్థిరపడాలన్న ధోరణి పెరుగుతోందని పాక్‌ రక్షణ మంత్రి ఆసిఫ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - Oct 22 , 2026 | 04:47 AM