Share News

South Korea Schools: దక్షిణ కొరియాలో4 వేల స్కూళ్లు మూత

ABN , Publish Date - Jan 01 , 2026 | 05:33 AM

ఖాళీ బల్లలు, విద్యార్థులు లేని క్లాసు రూములు.. దక్షిణ కొరియాలోని చాలా ప్రావిన్సుల్లో పాఠశాలల్లో ఇవే కనిపిస్తున్నాయి.

South Korea Schools: దక్షిణ కొరియాలో4 వేల స్కూళ్లు మూత

  • చేరికలు లేకపోవడంతో బడులకు తాళాలు

సియోల్‌, డిసెంబరు 31: ఖాళీ బల్లలు, విద్యార్థులు లేని క్లాసు రూములు.. దక్షిణ కొరియాలోని చాలా ప్రావిన్సుల్లో పాఠశాలల్లో ఇవే కనిపిస్తున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 4 వేలకు పైగా పాఠశాలలు మూతబడ్డాయి. గత కొంతకాలంగా చేరికలు లేకపోవడంతో వాటిని మూసివేసినట్లు అధికార డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన చట్ట సభ్యుడు జిన్‌ సున్‌ మీ వెల్లడించారు. విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 4,008 ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలు మూత బడ్డాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలే 3,674 ఉన్నాయి. 2025 విద్యా సంవత్సరంలో 2,232 టీచర్‌ పోస్టులు కూడా తగ్గించేసినట్లు దక్షిణ కొరియా విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాఠశాలలు మూత బడటానికి జననాల రేటు భారీగా తగ్గిపోవడమే ప్రధాన కారణం అని భావిస్తున్నారు. అలాగే రాజధాని ప్రాంతం కంటే ప్రావిన్సుల్లో ఎక్కువ బడులు మూత బడటానికి పట్టణీకరణ కూడా ఓ కారణంగా అంచనా వేస్తున్నారు.

Updated Date - Jan 01 , 2026 | 05:34 AM