అమెరికాలో హిందూ దేవాలయంపై ఇటుకలతో దాడి
ABN , Publish Date - Oct 04 , 2026 | 05:42 AM
అమెరికాలోని ఒహాయో రాష్ట్రం గ్రేటర్ క్లీవ్‌లాండ్‌లో ఉన్న హిందూ దేవాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు ఇటుకలతో దాడి చేశారు.
లోపల భక్తులు ఉండగానే దౌర్జన్యం
న్యూఢిల్లీ, అక్టోబరు 3: అమెరికాలోని ఒహాయో రాష్ట్రం గ్రేటర్ క్లీవ్‌లాండ్‌లో ఉన్న హిందూ దేవాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు ఇటుకలతో దాడి చేశారు. కిటీకీలు, గోడలకు నష్టం కలిగించారు. శుక్రవారం మధ్యాహ్నం శ్రీ స్వామి నారాయణ్ హిందూ మందిరం...వడ్తాల్‌ధాంపై దాడి జరిగినట్టు కొయిలేషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా (కోహ్నా) తెలిపింది. భక్తులు, పూజారులు లోపల ఉండగానే ఈ దాడి జరిగినట్టు పేర్కొంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నగర మేయర్‌ను కోరింది. హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్‌ఏఎఫ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుహాగ్ శుక్లా ఎక్స్‌లో పోస్టు పెడుతూ హిందూ అమెరికన్లపై విద్వేషాలు పెరుగుతున్నాయని, వీటిని ప్రజాప్రతినిధులు ఖండించాలని కోరారు. ఇంతవరకు సోషల్ మీడియాకు పరిమితమైన విద్వేషం ఇప్పుడు ప్రత్యక్షదాడుల రూపంలో కనిపిస్తోందన్నారు.