Share News

బాలిస్టిక్‌ క్షిపణులు పరీక్షించిన ఉత్తర కొరియా

ABN , Publish Date - Sep 21 , 2026 | 06:05 AM

ఉత్తర కొరియా మూడు గంటల వ్యవధిలో రెండు బాలిస్టిక్‌ క్షిపణులను పరీక్షించింది. తూర్పు తీరంలోని వోన్సాన్‌ ప్రాంతం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణుల్లో ఒకటి 450, మరొకటి 600 కిలోమీటర్లు ప్రయాణించి సము ద్ర జలాల్లో పడిపోయాయి.

బాలిస్టిక్‌ క్షిపణులు   పరీక్షించిన ఉత్తర కొరియా
ballistic missile

3 గంటల వ్యవధిలో రెండు ప్రయోగాలు

దక్షిణ కొరియా, జపాన్‌ ఆందోళన

సియోల్‌, సెప్టెంబరు 20: ఉత్తర కొరియా మూడు గంటల వ్యవధిలో రెండు బాలిస్టిక్‌ క్షిపణులను పరీక్షించింది. తూర్పు తీరంలోని వోన్సాన్‌ ప్రాంతం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణుల్లో ఒకటి 450, మరొకటి 600 కిలోమీటర్లు ప్రయాణించి సము ద్ర జలాల్లో పడిపోయాయి. దీనిపై దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే బాలిస్టిక్‌ క్షిపణి పరీక్షలు నిలిపివేయాలని డిమాండ్‌ చేసింది. క్షిపణి ప్రయోగాలు తమ దేశ భద్రతకు విఘాతం కలిగిస్తాయని జపాన్‌ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. గతనెలలో అమెరికా-దక్షిణ కొరియా మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు జరపడంతో ఉత్తర కొరియా తా జాగా ఈ క్షిపణులు పరీక్షించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ త్వరలో సమావేశమవుతారని భావిస్తున్న తరుణంలో ఈ క్షిపణి ప్రయోగాలు తలనొప్పిగా మారాయి.

Updated Date - Sep 21 , 2026 | 06:05 AM