అమెరికాలో కాల్పుల కలకలం..
ABN , Publish Date - Oct 11 , 2026 | 03:45 AM
అమెరికాలో జన సమూహంపై కాల్పుల ఘటన కలకలం రేపింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఎరీ నగరంలో ఓ ఇంటి లోపల, వెలుపల ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో చిన్నారులు సహా కనీసం 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
చిన్నారులతో సహా 9 మంది మృతి
ఎరీ, అక్టోబరు 10: అమెరికాలో జన సమూహంపై కాల్పుల ఘటన కలకలం రేపింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఎరీ నగరంలో ఓ ఇంటి లోపల, వెలుపల ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో చిన్నారులు సహా కనీసం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల అనంతరం నిందితుడు తనకు తాను కాల్చుకొని మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన తమను తీవ్రంగా కలచివేసిందని స్థానిక పోలీసు అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. తమ సిబ్బంది, దర్యాప్తు బృందాలు ఎదుర్కొన్న అత్యంత కఠినమైన, హృదయవిదారక ఘటనల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. కాగా, బాధితుల, అనుమానితుడి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. కాల్పులకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.