నేను బతికే ఉన్నా..!
ABN , Publish Date - Mar 19 , 2026 | 06:55 AM
తాను చనిపోయినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొట్టిపారేశారు. ‘నేను బతికే ఉన్నాను’ అంటూ ఎక్స్‌లో ఓ వీడియోను సోమవారం పోస్టు చేశారు.
అమెరికా రాయబారి మైక్ హుకబీతో కలిసి ఉన్న వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసిన నెతన్యాహు
న్యూఢిల్లీ, మార్చి 18: తాను చనిపోయినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొట్టిపారేశారు. ‘నేను బతికే ఉన్నాను’ అంటూ ఎక్స్‌లో ఓ వీడియోను సోమవారం పోస్టు చేశారు. నెతన్యాహు, అమెరికా రాయబారి మైక్ హుకబీ నడుస్తూ సరదాగా మాట్లాడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ‘మీరు ఎలా ఉన్నారో చూసి రమ్మని ట్రంప్ నన్ను పంపించారు’ అని హుకబీ అనగా.. ‘నేను బతికే ఉన్నాను’ అని నెతన్యాహూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. చివరిగా ‘ఇదిగో మేం కరచాలనం చేస్తున్నాం. నా చేతికి ఐదు వేళ్లే ఉన్నాయి’ చూడండి అని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఇటీవల మీడియాతో వీడియో కాన్ఫరెన్స్‌లో నెతన్యాహు మాట్లాడిన వీడియోలో ఓ సందర్భంలో ఆయన చేతికి ఆరు వేళ్లు కనిపించడంతో అది ఏఐ వీడియో అని, నెతన్యాహు చనిపోయారని ప్రచారం జరుగతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, అంతకుముందు ఇరాన్ సీనియర్ నాయకుడు లరిజానీ మృతిపై వార్ రూమ్ నుంచి ప్రకటన చేస్తూ నెతన్యాహు విడుదల చేసిన వీడియో పూర్తిగా ఒరిజినల్ కాదని గూగుల్ జెమినై తెలిపింది.