Share News

భారత్‌కు నేపాల్‌ ప్రధాని

ABN , Publish Date - Nov 23 , 2026 | 03:45 AM

నేపాల్‌ ప్రధాని బాలేంద్ర షా అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్‌ ప్రసాద స్వాగతం పలికారు.

భారత్‌కు నేపాల్‌ ప్రధాని

  • నేడు మోదీతో బాలేంద్ర షా చర్చలు

న్యూఢిల్లీ, నవంబరు 22: నేపాల్‌ ప్రధాని బాలేంద్ర షా అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్‌ ప్రసాద స్వాగతం పలికారు. మార్చిలో పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ద్వైపాక్షిక చర్చల నిమిత్తం బాలెన్‌ షా చేపడుతున్న తొలి అధికారిక విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. సోమవారం ఆయన ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఇంధనం, జల విద్యుత్తు, రైల్వేలు, మౌలిక వసతులపై ఇరువురు నేతలు చర్చలు జరపనున్నారు. రక్సౌల్‌-కాఠ్‌మాండూ, అయోధ్య-జనక్‌పురిల మధ్య రైళ్లు నడిపే అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇరువురు నేతలు వివిధ ప్రాజెక్టులను వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ చర్చలు ఉపకరించనున్నాయి.

Updated Date - Nov 23 , 2026 | 03:46 AM