Share News

భారత భూభాగాల్ని మనమూ ఆక్రమించాం!

ABN , Publish Date - Jun 01 , 2026 | 03:58 AM

నేపాల్‌ కూడా భారత భూభాగాల్ని ఆక్రమించిందని పేర్కొంటూ ఆ దేశ నూతన ప్రధాని బాలేంద్ర షా మరో వివాదానికి తెర తీశారు. నేపాల్‌ పార్లమెంటులో..

భారత భూభాగాల్ని మనమూ ఆక్రమించాం!

  • మరో వివాదానికి తెర తీసిన నేపాల్‌ ప్రధాని బాలేంద్ర షా

కాట్‌మాండూ, మే 31: నేపాల్‌ కూడా భారత భూభాగాల్ని ఆక్రమించిందని పేర్కొంటూ ఆ దేశ నూతన ప్రధాని బాలేంద్ర షా మరో వివాదానికి తెర తీశారు. నేపాల్‌ పార్లమెంటులో భారత్‌తో సరిహద్దు వివాదంపై ఆదివారం సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ... ఈమేరకు వ్యాఖ్యానించడం విశేషం. నేపాల్‌ భారత్‌ల మధ్య కాలాపానీ, లిపులేఖ్‌, లింపియధురల విషయమై చాలాకాలంగా సరిహద్దు వివాదం కొనసాగుతోంది. బాలేంద్ర షా ఈ వివాదంపై నేపాల్‌ పార్లమెంటులో మాట్లాడుతూ.. ‘‘మీరు ఈ వాస్తవం తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం... ఈ విషయం నాకు ఇటీవలే తెలిసింది. భారత్‌ మాత్రమే నేపాల్‌ భూభాగాల్ని ఆక్రమించలేదు... నేపాల్‌ కూడా అదే పని చేసింది... అనేక చోట్ల భారత భూభాగాల్ని ఆక్రమించింది... రెండు దేశాలు ఈ ఆక్రమణలను అధ్యయనం చేసి స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాల్సి ఉంది.’’ అని చెప్పడం విశేషం. అలాగే భారత్‌తో సరిహద్దు వివాదం బ్రిటీషు ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని వీడిన నాటి నుంచి ఉన్నందువల్ల బ్రిటన్‌తోనూ సంప్రదించినట్లు ఆయన వివరించారు. నేపాల్‌ ప్రధాని వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

Updated Date - Jun 01 , 2026 | 03:58 AM