ఇలవంక
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:43 AM
చందమామను చుట్టివచ్చేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తలపెట్టిన మానవసహిత మిషన్ ఆర్టెమిస్-2 ప్రయాణంలో...
వాషింగ్టన్, ఏప్రిల్ 3: చందమామను చుట్టివచ్చేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తలపెట్టిన మానవసహిత మిషన్ ఆర్టెమిస్-2 ప్రయాణంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. జాబిల్లి దిశగా సాగుతున్న ప్రయాణంలో భాగంగా ఇది అంతరిక్షం నుంచి భూమిని ఫొటోలు తీసింది. ఆ చిత్రాల్లో భూగ్రహం అందమైన నెలవంకలా దర్శనమిచ్చింది. ఆర్టెమిస్-2 తీసిన ఈ అద్భుత చిత్రాలను నాసా శుక్రవారం విడుదల చేసింది. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 3.54 గంటలకు నాసా ప్రతిష్ఠాత్మక చంద్రమండల యాత్ర ‘ఆర్టెమిస్-2’ మొదలైంది. నలుగురు వ్యోమగాములతో కూడిన ఓరియన్ వ్యోమనౌకను మోసుకుంటూ ఎస్‌ఎల్‌ఎస్ రాకెట్ ప్రస్తుతం జాబిల్లి దిశగా దూసుకెళ్తోంది. ఇది చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంగా వెళ్లి దాన్ని చుట్టి రానుంది. ఈ యాత్ర పది రోజులపాటు సాగనుంది.