గాయపడినా చురుగ్గా మొజ్తబా మానసిక స్థితి!
ABN , Publish Date - Apr 12 , 2026 | 03:27 AM
అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో తీవ్రంగా గాయపడిన సుప్రీంలీడర్ ముజ్తాబా ఖమేనీ మానసికంగా మాత్రం గట్టిగా ఉన్నారని ‘రాయిటర్స్’ కథనం ప్రచురించింది.
ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీలు.. రాయిటర్స్ కథనం
దుబాయ్, ఏప్రిల్ 11 : అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో తీవ్రంగా గాయపడిన సుప్రీంలీడర్ ముజ్తాబా ఖమేనీ మానసికంగా మాత్రం గట్టిగా ఉన్నారని ‘రాయిటర్స్’ కథనం ప్రచురించింది. ఉన్నతస్థాయి భేటీలకు ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతున్నారని తెలిపింది. ఇరాన్ ప్రభుత్వంలోని అంతర్గత వర్గాల నుంచి మూడు మార్గాల్లో అందిన సమాచారాన్ని తన కథనానికి ఆధారం చేసుకున్నట్టు పేర్కొంది. ఈ కథనాన్ని అనుసరించి.. యుద్ధం మొదలైన తొలిరోజే అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, కుటుంబసభ్యులు మరణించగా, ముజ్తాబా తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ దాడిలో గుర్తు పట్టలేనివిధంగా ముజ్తాబా ముఖం మారిపోయింది. ముఖ భాగం, పాదాలకు బలమైన గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగి 40 రోజులు దాటిపోయినా, ఇప్పటికీ కదలలేని స్థితిలోనే ఉన్నారు.