Share News

Mass Shooting in Mississippi: అమెరికాలో కాల్పులు.. ఆరుగురి మృతి

ABN , Publish Date - Jan 11 , 2026 | 03:03 AM

అమెరికాలో మరోసారి సామూహిక కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. మిస్సిసిపీలోని క్లే కౌంటీలో శుక్రవారం రాత్రి మూడు చోట్ల జరిగిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు.

Mass Shooting in Mississippi: అమెరికాలో కాల్పులు.. ఆరుగురి మృతి

వాషింగ్టన్‌, జనవరి 10: అమెరికాలో మరోసారి సామూహిక కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. మిస్సిసిపీలోని క్లే కౌంటీలో శుక్రవారం రాత్రి మూడు చోట్ల జరిగిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. ఓ అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిగినట్టు క్లే కౌంటీ షరీప్‌ ఎడ్డీ స్కాట్‌ ప్రకటించినా, ఇందుకుగల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. 20వేల జనాభా ఉండే ఈ కౌంటీలో 3చోట్ల కాల్పులు జరగడంతో ఆందోళన నెలకొంది.

Updated Date - Jan 11 , 2026 | 03:03 AM