Share News

అనుమానాస్పద స్థితిలో జైషే చీఫ్‌ మసూద్‌ సోదరుడి మృతి

ABN , Publish Date - Apr 01 , 2026 | 03:44 AM

నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ సోదరుడు, సంస్థలో కీలక సభ్యుడు హకీం మహమ్మద్‌ తహీర్‌ అన్వర్‌ సోమవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో...

అనుమానాస్పద స్థితిలో జైషే చీఫ్‌ మసూద్‌ సోదరుడి మృతి

బహవల్‌పూర్‌, మార్చి 31: నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ సోదరుడు, సంస్థలో కీలక సభ్యుడు హకీం మహమ్మద్‌ తహీర్‌ అన్వర్‌ సోమవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌లో మరణించాడని తెలుస్తోంది. ఆయన మృతి వార్త జైషే మహ్మద్‌ అనుకూల టెలిగ్రామ్‌ చానళ్లలో సర్క్యులేట్‌ అవుతోంది. సోమవారం రాత్రి జామియా మసీద్‌ ఉస్మాన్‌-ఓ-అలీలో హకీం మహమ్మద్‌ తహీర్‌ అంత్యక్రియలు జరిగినట్లు సమాచారం. ఆయన మృతిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. జైషే మహమ్మద్‌ మిలిటరీ యూనిట్‌కు అన్వర్‌ సారధిగా ఉన్నాడు. గత ఏడాది మేలో జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారత్‌ క్షిపణి దాడిలో మసూద్‌ మరో సోదరుడు అబ్దుల్‌ రవూఫ్‌ అజర్‌ సహా 10 మంది కుటుంబ సభ్యులు మరణించారు.

Updated Date - Apr 01 , 2026 | 03:46 AM