మణిపుర్లో ఐదుగురు కుకీ యువకుల దారుణ హత్య
ABN , Publish Date - Nov 02 , 2026 | 02:57 AM
మణిపుర్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రెండు ప్రత్యర్థి సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు కుకీ యువకులు మృతి చెందగా..
ఇంఫాల్, నవంబరు 1: మణిపుర్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రెండు ప్రత్యర్థి సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు కుకీ యువకులు మృతి చెందగా.. మూడు రోజుల క్రితం అదృశ్యమైన మరో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. కెక్రూనాగ గ్రామంలో శనివారం ఉదయం రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో గ్రామ వాలంటీర్లుగా పనిచేస్తున్న ముగ్గురు కుకీ యువకులు మృతిచెందారు. మరోవైపు కాంగ్పోక్సి జిల్లాలో మూడు రోజులుగా అదృశ్యమైన ఇద్దరు కుకీ యువకుల మృతదేహాలు పక్క జిల్లాలో గోనె సంచుల్లో దొరికాయి.