హోర్ముజ్‌ను దాటిన ఎల్‌పీజీ క్యారియర్.. త్వరలో భారత్‌కు..
ABN , Publish Date - May 02 , 2026 | 10:15 PM
భారతీయ సిబ్బంది ఉన్న ఒక ఎల్‌పీజీ క్యారియర్ తాజాగా హోర్ముజ్ జలసంధిని దాటింది. మరికొన్ని రోజుల్లో ఈ నౌక భారత్‌కు చేరుకుంటుందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ సిబ్బంది ఉన్న ఒక ఎల్‌పీజీ క్యారియర్ శనివారం హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మార్షల్ ఐల్యాండ్స్ జెండా ఉన్న ఈ ఎమ్‌వీ సర్వ్ శక్తి ట్యాంకర్‌లో మొత్తం 20 మంది సిబ్బంది ఉండగా అందులో 18 మంది భారతీయులు. మే 13న ఇది భారత్‌కు చేరుకుంటుందని సమాచారం.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇలాంటి ట్యాంకర్‌ను భారీ క్యారియర్లు అని పిలుస్తారు. ఇందులో 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ ఉంది. ఈ నౌక గతంలో పర్షియన్ గల్ఫ్, భారత్ మధ్య రాకపోకలు సాగించింది.
యూఎస్- ఇరాన్ యుద్ధం మొదలైన నాటి నుంచీ ముడి చమురు, గ్యాస్ రవాణాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇరాన్‌ను దిగ్బంధనం చేసిన అమెరికా అధ్యక్షుడు తాము సముద్ర దొంగల వలె ఇరాన్ నౌకలు సీజ్ చేస్తున్నామని తెలిపారు. ఇటీవల యుద్ధం ముగింపు దిశగా ఇరాన్ చేసిన ప్రతిపాదనలు కూడా తమకు నచ్చలేదని ట్రంప్ చెప్పుకొచ్చారు.