లండన్‌లో యూదుల స్వచ్ఛంద సంస్థపై దాడి
ABN , Publish Date - Mar 24 , 2026 | 04:41 AM
లండన్‌లో యూదుల స్వచ్ఛంద సంస్థకు చెందిన 4 అంబులెన్స్‌లను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. ఈ ఘటనలో సిలెండర్లు పేలి ...
లండన్, మార్చి 23: లండన్‌లో యూదుల స్వచ్ఛంద సంస్థకు చెందిన 4 అంబులెన్స్‌లను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. ఈ ఘటనలో సిలెండర్లు పేలి సమీప భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఘటనను బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ఖండించారు. మతవిద్వేష దాడి జరగడం తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందన్నారు. ముగ్గురు అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో ఈ ఘటనకు ప్రాధాన్యం ఏర్పడింది.