ఉగ్రవాది అమిర్ హమ్జాపై లాహోర్‌లో కాల్పులు
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:04 AM
ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తొయిబా సహ వ్యవస్థాపకుడు, ఉగ్రవాది అమిర్ హమ్జా గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు.
లాహోర్, ఏప్రిల్ 16: ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తొయిబా సహ వ్యవస్థాపకుడు, ఉగ్రవాది అమిర్ హమ్జా గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. లాహోర్‌లోని ఓ టీవీ చానల్ కార్యాలయం బయట అతడు ప్రయాణిస్తున్న వాహనంపై అజ్ఞాత వ్యక్తులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన హమ్జాను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యవర్గాలు తెలిపాయి. భారత్‌లో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో హమ్జా ప్రమేయముంది. అమెరికా అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.