గనిపై కొండచరియలు పడి కాంగోలో 227 మంది కార్మికుల మృతి
ABN , Publish Date - Feb 01 , 2026 | 04:26 AM
మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో పెను విషాదం చోటు చేసుకుంది. తూర్పు కాంగోలోని రుబాయా ప్రాంతంలో..
గోమా (కాంగో), జనవరి 31: మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో పెను విషాదం చోటు చేసుకుంది. తూర్పు కాంగోలోని రుబాయా ప్రాంతంలో ఉన్న కొల్టాన్ గనులపై భారీగా కొండచరియలు విరిగిపడడంతో 227 మందికి పైగా కార్మికులు చనిపోయారు. ఈ ప్రాంతంలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా కొండచరియలు గనిలోని సొరంగాల్లో పనిచేస్తున్న కార్మికులపై పడ్డాయి. దీంతో వారంతా అక్కడికక్కడే సజీవ సమాధి అయ్యారు.