Share News

ఖమేనీ అంత్యక్రియలు వాయిదా

ABN , Publish Date - Mar 05 , 2026 | 05:36 AM

అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి.

ఖమేనీ అంత్యక్రియలు వాయిదా

టెహ్రాన్‌, మార్చి 4: అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. తేదీని తర్వాత ప్రకటిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఖమేనీ జన్మించిన మషాద్‌ పట్టణంలో పూడ్చేందుకు భౌతికకాయాన్ని తరలించారు. బుధవారం అంత్యక్రియలు జరుగుతాయని తొలుత ప్రకటించినా చివరి నిమిషంలో వాయిదా వేశారు. పరస్పర దాడులు కొనసాగుతుండటమే అంత్యక్రియల వాయిదాకు కారణమని తెలుస్తోంది. అంతిమ నివాళులర్పించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశముంది. అంత్యక్రియల ఏర్పాట్లను సమన్వయ మండలి అధ్యక్షుడు మెహసిన్‌ మహ్మదీ పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - Mar 05 , 2026 | 05:36 AM