Share News

ఎవరెస్ట్‌ పర్వతం 32వ సారి అధిరోహణ!

ABN , Publish Date - May 18 , 2026 | 02:32 AM

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ పర్వతాన్ని 32వ సారి అధిరోహించడం ద్వారా నేపాల్‌కు చెందిన షెర్పా కామి రీటా తన రికార్డును తానే అధిగమించాడు.

ఎవరెస్ట్‌ పర్వతం 32వ సారి అధిరోహణ!

  • నేపాలీ షెర్పా కామి రీటా ఘనత

కాట్‌మాండూ, మే 17 : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ పర్వతాన్ని 32వ సారి అధిరోహించడం ద్వారా నేపాల్‌కు చెందిన షెర్పా కామి రీటా తన రికార్డును తానే అధిగమించాడు. 56 ఏళ్ల కామి రీటా 8,848.86 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్‌ పర్వతాన్ని ఆదివారం ఉదయం 10.12 గంటలకు 32వ సారి అధిరోహించినట్లు నేపాల్‌ పర్యాటక శాఖ తెలిపింది. అనేకసార్లు ఎవరెస్ట్‌ పర్వతాన్ని అధిరోహించడంతో ఆయనకు ఎవరెస్ట్‌ మ్యాన్‌గా పేరొచ్చింది. నేపాల్‌లోని సొలుఖుంబు జిల్లాలోని థేమి గ్రామంలో 1970 జనవరి నెలలో జన్మించిన ఈయన 1992లో పర్వతారోహణ ప్రారంభించారు. 1994లో తొలిసారిగా ఎవరె్‌స్టని అధిరోహించారు. కాగా మౌంటెన్‌ క్వీన్‌గా పేరొందిన నేపాలీ షెర్పా మహిళ లక్పా ఆదివారం 11వ సారి ఎవరె్‌స్టని అధిరోహించి తన రికార్డును తానే అధిగమించడం విశేషం. ఎవరె్‌స్టని ఎక్కిన తొలి నేపాలీ మహిళ కూడా ఈమే. ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఆమె ఎవరెస్ట్‌ అధిరోహణ పూర్తిచేసిందని నేపాల్‌ పర్యాటక శాఖ తెలిపింది.

Updated Date - May 18 , 2026 | 02:32 AM