Share News

హెచ్‌-1బీ వీసా వ్యవస్థ పూర్తిగా విఫలం

ABN , Publish Date - Oct 03 , 2026 | 02:39 AM

హెచ్‌-1బీ వీసా విధానంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వీసా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, అవసరమైతే దానిని పూర్తిగా రద్దు చేయడానికి తాను మద్దతు ఇస్తానని పేర్కొన్నారు.

హెచ్‌-1బీ వీసా వ్యవస్థ పూర్తిగా విఫలం

  • దాని రద్దుకు మద్దతిస్తా: జేడీ వాన్స్‌

  • కంపెనీలు ఆ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపణ

వాషింగ్టన్‌, అక్టోబరు 2: హెచ్‌-1బీ వీసా విధానంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వీసా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, అవసరమైతే దానిని పూర్తిగా రద్దు చేయడానికి తాను మద్దతు ఇస్తానని పేర్కొన్నారు. అమెరికన్ల స్థానంలో చౌకగా లభించే విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు కార్పొరేట్‌ కంపెనీలు హెచ్‌-1బీ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు. సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’లో శుక్రవారం విడుదల చేసిన ఓ వీడియోలో వాన్స్‌ తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘‘అమెరికన్‌ అకౌంటెంట్‌కు 60వేల డాలర్లు చెల్లించే బదులు, 45వేల డాలర్లు ఇచ్చి విదేశీ ఉద్యోగిని నియమించుకోవడం మేధావులను ఆహ్వానించడం కాదు, అమెరికన్ల ఉద్యోగావకాశాలను దెబ్బతీయడమే’’నని వ్యాఖ్యానించారు. హెచ్‌-1బీ వీసా దరఖాస్తులపై విధించిన 1 లక్ష డాలర్ల ఫీజును కూడా వాన్స్‌ సమర్థించారు.

Updated Date - Oct 03 , 2026 | 02:40 AM