Share News

ట్రంప్‌ కుమార్తె ఇవాంకా హత్యకు కుట్ర.. భగ్నం

ABN , Publish Date - May 24 , 2026 | 03:59 AM

అమెరికా, ఇజ్రాయెల్‌లపై దాడులకు కుట్ర పన్నుతోన్న ఒక ఇరాకీ వ్యక్తి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ హత్యకు కూడా కుట్ర పన్నినట్లు గుర్తించారు.

ట్రంప్‌ కుమార్తె ఇవాంకా హత్యకు కుట్ర.. భగ్నం

  • ఖాసిం సులేమాని హత్యకు ప్రతీకారంగానే..

న్యూఢిల్లీ, మే 23: అమెరికా, ఇజ్రాయెల్‌లపై దాడులకు కుట్ర పన్నుతోన్న ఒక ఇరాకీ వ్యక్తి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ హత్యకు కూడా కుట్ర పన్నినట్లు గుర్తించారు. మహమ్మద్‌ బాఖర్‌ సాద్‌ దావూద్‌ అల్‌ సాది(32) అనే ఆ వ్యక్తి 2020లో ఇరాన్‌ ఉన్నత మిలటరీ కమాండర్‌ ఖాసిం సులేమానిపై బాగ్దాద్‌లో డ్రోన్‌తో దాడి చేసి చంపేసినందుకు ప్రతీకారంగా ఇవాంకా ట్రంప్‌ను చంపుతానని ప్రతిన బూనాడు. ఫ్లోరిడాలోని ఇవాంకా నివాసాన్ని చూపే మ్యాప్‌, బ్లూప్రింట్‌లను దగ్గర ఉంచుకున్నాడు. అలాగే ఇవాంకా దంపతులు నివాసం ఉండే ప్రాంతం చిత్రాన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేశాడు. దాంతో పాటు ‘మీ ప్యాలెస్ లు గానీ, సీక్రెట్‌ సర్వీస్‌ గానీ మిమ్మల్ని కాపాడలేవని పేర్కొన్నాడు. ప్రతీకారానికి సమయం ఉందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. అతడిని తుర్కియేలో మే 15న అరెస్టు చేశారు. అనంతరం అమెరికా తరలించారు. అమెరికా, యూర్‌పలలో జరిగిన మొత్తం 18 ఉగ్ర దాడులు లేదా వాటి ప్రణాళికలతో అల్‌ సాదికి సంబంధం ఉందని అమెరికా న్యాయ శాఖ పేర్కొంది.

Updated Date - May 24 , 2026 | 04:00 AM