Share News

నిరసనకారులపై మెలోనీ ఉక్కుపాదం!

ABN , Publish Date - Oct 22 , 2026 | 05:00 AM

మైనర్లు ఎవరైనా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే దానికి వారి తల్లిందండ్రులను బాధ్యులను చేసి నష్టపరిహారాన్ని వసూలు చేసేలా ఇటలీలోని మెలోనీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది.

నిరసనకారులపై మెలోనీ ఉక్కుపాదం!

న్యూడిల్లీ, అక్టోబరు 21: మైనర్లు ఎవరైనా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే దానికి వారి తల్లిందండ్రులను బాధ్యులను చేసి నష్టపరిహారాన్ని వసూలు చేసేలా ఇటలీలోని మెలోనీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది. ఇటీవలి కాలంలో ఇటలీలో హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో మెలోనీ సర్కారు ఈ చట్టానికి రూపకల్పన చేసింది. దీని ప్రకారం.. ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తే క్రిమినల్‌ నేరంగా పరిగణించి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. గరిష్ఠంగా రూ.18లక్షల వరకు జరిమానా విధిస్తారు. అనుమానాస్పదంగా అనిపించే 14-17 ఏళ్ల పిల్లలపైనా నిఘా పెట్టొచ్చు. వారు సమాజానికి ముప్పుగా పరిణమిస్తారనుకుంటే పోలీసులు అరెస్టు చేయొచ్చు.

Updated Date - Oct 22 , 2026 | 05:02 AM