Share News

అమెరికా నుంచి ఎఫ్‌-35ఐ,ఎఫ్‌-15ఐఏ యుద్ధ విమానాల కొనుగోలు

ABN , Publish Date - May 04 , 2026 | 03:40 AM

అమెరికాకు చెందిన లాక్‌హీడ్‌ మార్టిన్‌, బోయింగ్‌ సంస్థల నుంచి ఇజ్రాయెల్‌ అత్యాధునిక ఎఫ్‌-35ఐ, ఎఫ్‌-15ఐఏ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది.

అమెరికా నుంచి ఎఫ్‌-35ఐ,ఎఫ్‌-15ఐఏ యుద్ధ విమానాల కొనుగోలు

  • వెల్లడించిన ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ

న్యూఢిల్లీ, మే 3: అమెరికాకు చెందిన లాక్‌హీడ్‌ మార్టిన్‌, బోయింగ్‌ సంస్థల నుంచి ఇజ్రాయెల్‌ అత్యాధునిక ఎఫ్‌-35ఐ, ఎఫ్‌-15ఐఏ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది. ఈమేరకు ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ ప్రకటించింది. రెండు స్క్వాడ్రన్ల వరకు ఈ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది. ఈమేరకు తమ రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు 119 బిలియన్ల డాలర్ల వ్యయమయ్యే ఆయుధ సేకరణ ప్రణాళికకు ఇజ్రాయెల్‌ మినిస్టీరియల్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఇజ్రాయెల్‌ భద్రతను ఇది మరింత బలోపేతం చేస్తుందని ఆ కమిటీ ఆదివారం పేర్కొంది. తక్షణ యుద్ధ అవసరాలతో పాటు రానున్న కాలంలోనూ యుద్ధాల్లో పైచేయి సాధించేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ అమీర్‌ బరామ్‌ ఈ సందర్భంగా చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్‌ - ఇరాన్‌ల మధ్య సాగుతోన్న యుద్ధం అత్యాధునిక యుద్ధ విమానాల ప్రాధాన్యాన్ని తెలియజేసిందని ఆయన పేర్కొన్నారు. ఎఫ్‌-35ఐ, ఎఫ్‌-15ఐఏల కొనుగోలు ఇప్పటికే బలమైన ఇజ్రాయెల్‌ గగన తలఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు పేర్కొన్నారు. .

Updated Date - May 04 , 2026 | 03:40 AM