Share News

లెబనాన్‌పై ఉధృతంగా దాడులు

ABN , Publish Date - Apr 13 , 2026 | 05:15 AM

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ఉధృతంగా కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని ఖనా, మరూబ్‌, టైర్‌, దేర్‌ ఖనూన్‌ అల్‌ న్‌హ్ర, షక్రా, అల్‌ బజౌరియా, ఖలిలా...

లెబనాన్‌పై ఉధృతంగా దాడులు

బీరూట్‌, ఏప్రిల్‌ 12: లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ఉధృతంగా కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని ఖనా, మరూబ్‌, టైర్‌, దేర్‌ ఖనూన్‌ అల్‌ న్‌హ్ర, షక్రా, అల్‌ బజౌరియా, ఖలిలా, బఫ్లియే, కఫ్రా, హరిస్‌ తదితర పట్టణాల్లో వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో శనివారం 97 మంది, ఆదివారం 13 మంది మరణించినట్టు లెబనాన్‌ ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తంగా ఇజ్రాయెల్‌ దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య 2,055కు చేరిందని, 6,588 మంది గాయపడ్డారని ప్రకటించింది. కాగా అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటివరకు 3,375 మంది మృతిచెందారని, అందులో 500 మందికిపైగా మహిళలు ఉన్నారని ఇరాన్‌ ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ ఆర్గనైజేషన్‌ చీఫ్‌ అబ్బాస్‌ మస్జెదీ వెల్లడించారు.

Updated Date - Apr 13 , 2026 | 05:15 AM