లెబనాన్‌లో మరో 15 మంది మృతి
ABN , Publish Date - Apr 12 , 2026 | 03:30 AM
ఇరాన్ ఎంతగా పట్టుబట్టినా, ట్రంప్ చెప్పినా కూడా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు నిలిపివేయలేదు. అయితే శనివారం దాడుల తీవ్రతను కాస్త తగ్గించింది.
బీరూట్, ఏప్రిల్ 11: ఇరాన్ ఎంతగా పట్టుబట్టినా, ట్రంప్ చెప్పినా కూడా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు నిలిపివేయలేదు. అయితే శనివారం దాడుల తీవ్రతను కాస్త తగ్గించింది. రాజధాని బీరూట్‌పై మాత్రం దాడులు చేయలేదు. లెబనాన్ దక్షిణ ప్రాంతంలోని అల్ మజాడెల్, టెబ్నైన్, సెద్దిఖైన్, డిబ్బైన్, షమా, టైర్, నబతియే తదితర పట్టణాలపై మాత్రం వైమానిక దాడులు కొనసాగించింది. ఇజ్రాయెల్ సరిహద్దులకు సమీపంలోని నఖోరా పట్టణాల్లో పౌర ఆవాసాలను, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. హెజ్బొల్లా తీవ్రవాదులు అక్కడ నక్కి ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్నారని ఆరోపించింది. శనివారం 200 హెజ్బొల్లా స్థావరాలను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో 15మంది మృతిచెందినట్టు లెబనాన్ తెలిపింది.