హోర్ముజ్‌లోకి వస్తే సుడిగుండంలో చిక్కినట్టే!
ABN , Publish Date - Apr 13 , 2026 | 05:13 AM
హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని, సీమైన్స్‌ను తొలగిస్తామని ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) తీవ్రంగా మండిపడింది.
జలసంధిపై పూర్తి నియంత్రణ మాదే: ఐఆర్‌జీసీ
టెహ్రాన్, ఏప్రిల్ 12: హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని, సీమైన్స్‌ను తొలగిస్తామని ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) తీవ్రంగా మండిపడింది. శత్రుదేశాల నౌకలు హోర్ముజ్ జలసంధిలోకి వస్తే సుడిగుండంలో చిక్కుకున్నట్టేనని హెచ్చరించింది. జలసంధి రాకపోకలన్నీ పూర్తిగా ఇరాన్ సైన్యాల నియంత్రణలో ఉన్నాయని.. ఇరాన్ డ్రోన్లు పూర్తిగా పర్యవేక్షిస్తున్నాయని తెలిపింది. హోర్ముజ్ జలసంధి తెరిచే ఉందని, సాధారణ పౌర నౌకలు ఎలాంటి భయం లేకుండా ప్రయాణించవచ్చని పేర్కొంది. అయితే శత్రుదేశాల నౌకలు, మిలిటరీ నౌకలు వస్తే మాత్రం తీవ్రంగా స్పందిస్తామని స్పష్టం చేసింది.