Share News

ఐఆర్‌జీసీ కీలక కమాండర్‌ మృతి

ABN , Publish Date - Mar 21 , 2026 | 04:03 AM

ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) కమాండర్‌, అధికార ప్రతినిధి అలీ మొహమ్మద్‌ నయీని, బసిజ్‌ మిలీషియా...

ఐఆర్‌జీసీ కీలక కమాండర్‌ మృతి

ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) కమాండర్‌, అధికార ప్రతినిధి అలీ మొహమ్మద్‌ నయీని, బసిజ్‌ మిలీషియా ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌ హెడ్‌ ఇస్మాయిల్‌ అహ్మది శుక్రవారం ఇజ్రాయెల్‌ దాడుల్లో మృతిచెందారు. ఇరాన్‌ క్షిపణి పరిశ్రమకు నష్టమేమీ జరగలేదని, క్షిపణుల ఉత్పత్తి కొనసాగుతోందని.. షాక్‌ కలిగించే స్థాయిలో దాడులు చేస్తామని మొహమ్మద్‌ నయీని గురువారమే ప్రకటించారు. కానీ శుక్రవారం దాడుల్లో మృతిచెందారు. కాగా, తమ దేశంపై అన్యాయంగా దాడులు చేస్తున్న శత్రుదేశాల వారు పార్కుల్లో, పర్యాటక ప్రదేశాల్లో ఉన్నా సరే వదలబోమని ఇరాన్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌ జనరల్‌ అబోల్‌ఫజల్‌ షెకార్చి హెచ్చరించారు.

Updated Date - Mar 21 , 2026 | 04:03 AM