Share News

6 రోజులుగా ‘ఆఫ్‌లైన్‌’లో ఇరాన్‌!

ABN , Publish Date - Mar 06 , 2026 | 04:11 AM

అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు, ప్రాంతీయ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌ వ్యాప్తంగా ఆరు రోజులుగా ఇంటర్నెట్‌ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.

6 రోజులుగా ‘ఆఫ్‌లైన్‌’లో ఇరాన్‌!

టెహ్రాన్‌, మార్చి 5: అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు, ప్రాంతీయ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌ వ్యాప్తంగా ఆరు రోజులుగా ఇంటర్నెట్‌ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ దేశంలో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ పూర్తిగా స్తంభించిపోయిందని.. ఇప్పటికీ 1 శాతం మాత్రమే ఉందని ఇంటర్నెట్‌ మానిటరింగ్‌ గ్రూప్‌ నెట్‌ బ్లాక్స్‌ తెలిపింది. ఇరాన్‌ అధికారులు ఈ ఏడాది విధించిన రెండో షట్‌డౌన్‌ ఇది. జనవరిలో ఆ దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగి వేలాది మంది మరణించినప్పుడు పూర్తిగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా సమాచారం బయటకు వెళ్లకుండా ఉండేందుకు కమ్యూనికేషన్‌ వ్యవస్థలపై అధికారులు ఆంక్షలు విధించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇంటర్నెట్‌ సేవల పునరుద్ధరణపై ఇరాన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు.

Updated Date - Mar 06 , 2026 | 04:11 AM