Share News

మేం చర్చల కోసం ప్రయత్నించట్లేదు

ABN , Publish Date - Mar 03 , 2026 | 04:02 AM

అమెరికాతో అణు ఒప్పందం చర్చలను పునరుద్ధరించేందుకు తాను ప్రయత్నం చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఇరాన్‌ అత్యున్నత జాతీయ భద్రత మండలి కార్యదర్శి అలీ లరీజనీ ఖండించారు.

మేం చర్చల కోసం ప్రయత్నించట్లేదు

  • ఇరాన్‌ జాతీయ భద్రత మండలి కార్యదర్శి అలీ లరీజనీ

టెహ్రాన్‌, మార్చి 2: అమెరికాతో అణు ఒప్పందం చర్చలను పునరుద్ధరించేందుకు తాను ప్రయత్నం చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఇరాన్‌ అత్యున్నత జాతీయ భద్రత మండలి కార్యదర్శి అలీ లరీజనీ ఖండించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి దాడులకు తెగబడుతున్న అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒమన్‌ మధ్యవర్తుల ద్వారా చర్చల పునఃప్రారంభానికి లారీజనీ ప్రయత్నాలు చేస్తున్నట్లు వాల్‌ స్టీ్ట్రట్‌ జర్నల్‌ కథనం రాసిన నేపథ్యంలో ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. ట్రంప్‌ తన పగటి కలలతో మొత్తం గల్ఫ్‌ ప్రాంతాన్ని యుద్ధంలోకి తోసేశారని, ఇప్పుడు ఎక్కువమంది అమెరికన్లు చనిపోతారేమోనని భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ట్రంప్‌ అమెరికా ఫస్ట్‌ నినాదాన్ని పక్కనబెట్టి ఇజ్రాయెల్‌ ఫస్ట్‌ అంటూ ఆ దేశం కోసం అమెరికా ప్రయోజనాలను కూడా ఫణంగా పెడుతున్నారని చెప్పారు.

Updated Date - Mar 03 , 2026 | 04:02 AM