మీరు ఎక్కడున్నా పట్టుకుంటాం!
ABN , Publish Date - Nov 17 , 2026 | 03:16 AM
మినాబ్ నగరంలో పాఠశాలపై దాడి చేసి 168 మంది చిన్నారుల మరణానికి కారణమైన ఇద్దరు అమెరికా నేవీ అధికారులను ఎక్కడున్నా పట్టుకొని తీరుతామని ఇరాన్ ప్రతిన బూనింది.
ఇద్దరు అమెరికా నేవీ అధికారులకు ఇరాన్ హెచ్చరిక
న్యూఢిల్లీ, నవంబరు 16: మినాబ్ నగరంలో పాఠశాలపై దాడి చేసి 168 మంది చిన్నారుల మరణానికి కారణమైన ఇద్దరు అమెరికా నేవీ అధికారులను ఎక్కడున్నా పట్టుకొని తీరుతామని ఇరాన్ ప్రతిన బూనింది. దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ సోమవారం ‘ఎక్స్’లో ఈ హెచ్చరిక చేసింది. అమెరికా అధికారులపై దాడికి పాల్పడితే ఇరాన్‌ను అంతం చేస్తానని ట్రంప్ హెచ్చరించిన తర్వాతి రోజే ఇరాన్ నుంచి తాజా ప్రకటన వెలువడటం గమనార్హం. అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బెస్సెంట్‌ను చంపేస్తామంటూ ఇరాన్ నుంచి పదేపదే హెచ్చరికలు వస్తుండటంతో ఇటీవలే ఆయన వాషింగ్టన్‌లోని నివాసం నుంచి మిలిటరీ స్థావరంలోకి తరలిపోయారు.