ముందు ట్రంప్ జాగ్రత్తగా ఉండాలి
ABN , Publish Date - Mar 11 , 2026 | 03:48 AM
ఇరాన్‌పై 20 రెట్లు తీవ్రస్థాయిలో దాడులు చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ సుప్రీం సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరిజని కొట్టిపడేశారు...
మీ బెదిరింపులకు మేం భయపడబోం
అమెరికా, దాని భాగస్వాములకు హోర్ముజ్ నుంచి లీటరు చమురు కూడా పోనివ్వం: లరిజని
ఇరాన్‌పై 20 రెట్లు తీవ్రస్థాయిలో దాడులు చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ సుప్రీం సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరిజని కొట్టిపడేశారు. ‘‘ఇరాన్ త్యాగాలకు సిద్ధమైన దేశం. మీ ఉత్తుత్తి బెదిరింపులకు మేం భయపడబోం. మీకంటే పెద్ద శక్తులు కూడా ఇరాన్‌ను అంతం చేయలేకపోయాయి. ముందు మీరు అంతం కాకుండా జాగ్రత్త పడండి’’ అని హెచ్చరించారు. ఇక హోర్ముజ్ జలసంధి మీదుగా ఒక్క లీటరు చమురును కూడా అమెరికాకు, దాని భాగస్వాములకు వెళ్లనివ్వబోమని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ ప్రతినిధి అలీ మొహమ్మద్ నయీని ప్రకటించారు. చమురు, గ్యాస్ ధరలను నియంత్రించడం కోసం అమెరికా, దాని మిత్రదేశాలు చేస్తున్న ప్రయత్నాలు తాత్కాలికం, ప్రభావ రహితమని పేర్కొన్నారు. యుద్ధ సమయంలో వాణిజ్యం పూర్తిగా భద్రతా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.