Share News

‘గెరాల్డ్‌’కు సహకరిస్తే పేల్చేస్తాం

ABN , Publish Date - Mar 17 , 2026 | 03:51 AM

ఇజ్రాయెల్‌తో కలిసి తమ దేశంపై దాడులకు పాల్పడుతున్న అమెరికాకు ఇరాన్‌ మరో హెచ్చరిక జారీ చేసింది. అమెరికాకు చెందిన విమాన వాహక నౌక....

‘గెరాల్డ్‌’కు సహకరిస్తే పేల్చేస్తాం

  • అమెరికా సర్వీస్‌ సెంటర్లకు ఇరాన్‌ హెచ్చరిక

టెహ్రాన్‌, మార్చి 16: ఇజ్రాయెల్‌తో కలిసి తమ దేశంపై దాడులకు పాల్పడుతున్న అమెరికాకు ఇరాన్‌ మరో హెచ్చరిక జారీ చేసింది. అమెరికాకు చెందిన విమాన వాహక నౌక ‘గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌’కు సహకారం అందిస్తున్న లాజిస్టికల్‌, సర్వీస్‌ సెంటర్లను తాము టార్గెట్‌ చేసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఐఆర్‌జీసీ ప్రకటన చేసింది. అత్యంత ఆధునిక సాంకేతికతతో రూపొందించిన గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ నౌక ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో ఎర్రసముద్రం నుంచి ఆపరేషన్స్‌లో పాల్గొంటోంది. తాజాగా ఇది సౌదీ అరేబియాలోని జెద్దా వైపు కదులుతున్న నేపథ్యంలో.. దీని నుంచి తమ దేశానికి ముప్పు ఉందని ఇరాన్‌ భావిస్తోంది.

Updated Date - Mar 17 , 2026 | 03:51 AM