Share News

హొర్ముజ్‌లో ఆ దేశాల నౌకలను అనుమతించం!

ABN , Publish Date - Mar 06 , 2026 | 03:55 AM

అమెరికా, ఇజ్రాయెల్‌, యూరప్‌ దేశాలతోపాటు వాటికి మద్దతు ఇచ్చే దేశాల నౌకలకు హొర్ముజ్‌ జలసంధి ద్వారా ప్రయాణించే అనుమతిని...

హొర్ముజ్‌లో ఆ దేశాల నౌకలను అనుమతించం!

  • అయినా.. ముందుకొస్తే పేల్చివేస్తాం: ఇరాన్‌

టెహ్రాన్‌, న్యూఢిల్లీ, మార్చి 5: అమెరికా, ఇజ్రాయెల్‌, యూరప్‌ దేశాలతోపాటు వాటికి మద్దతు ఇచ్చే దేశాల నౌకలకు హొర్ముజ్‌ జలసంధి ద్వారా ప్రయాణించే అనుమతిని ఇవ్వబోమని ఇరాన్‌ స్పష్టం చేసింది. అయినప్పటికీ, ఆ దేశాల నౌకలు ముందుకొస్తే వాటిని పేల్చి వేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్‌కు చెందిన ‘ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌’ గురువారం ఒక ప్రకటన చేసింది. అంతర్జాతీయ నిబంధనలు, తీర్మానాలకు అనుగుణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, యుద్ధవేళల్లో హొర్ముజ్‌ జలసంధి మార్గంపై నియంత్రణ తమకే ఉంటుందని తెలిపింది. అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభమైన అనంతరం హొర్ముజ్‌ జలసంధిని మూ సేస్తున్నట్లు ఇరాన్‌ వర్గాలు పేర్కొన్నప్పటికీ.. అధికారికంగా ప్రకటించటం ఇదే తొలిసారి. కాగా, ఈ జాబితాలో భారత్‌ లేకపోవటంతో.. భారత్‌కువచ్చే రవాణా నౌకలకు ఇరాన్‌ మినహాయింపు ఇచ్చినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పశ్చిమాసియా నుంచి ముడిచమురు, సహజవాయువు తదితర ఉత్పత్తుల రవాణా నిలిచిపోయిన నేపథ్యంలో.. భారత్‌ అమెరికా సాయం కోరుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - Mar 06 , 2026 | 03:55 AM